తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: శ్యాంసుందర్ రావు

తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: శ్యాంసుందర్ రావు

యాదాద్రి వెలుగు:  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.  మంగళవారం భువనగిరి మున్సిపల్ కేంద్రంలో బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాయ దశరథ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.  మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పీవీ శ్యాంసుందర్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు

 అనంతరం శ్యాం సుందర్ రావు మాట్లాడుతూ.. బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు కేవలం ఓట్లు దండుకోవడానికి తప్ప,  ప్రజల శ్రేయస్సు కోసం కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాశం భాస్కర్, చందా మహేందర్, జనగాం లక్ష్మీ నరసింహ చారి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.