డేవిడ్ వార్నర్‌కి పీవీ సింధు వార్నింగ్.. జాగ్రత్తగా ఉండాలంటూ

డేవిడ్ వార్నర్‌కి పీవీ సింధు వార్నింగ్.. జాగ్రత్తగా ఉండాలంటూ

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కి హైదరాబాద్ తో ఉన్న అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అదరగొట్టి 2016లో టైటిల్ అందించాడు. దీంతో వార్నర్ క్రేజ్ తెలుగు నాట అమాంతం పెరిగిపోయింది. అంతే కాదు వార్నర్ కి పలు సెలబ్రిటీలతో మంచి సాన్నిహిత్యం ఉంది. వారిలో పీవీ సింధు ఒకరు. వార్నర్ బ్యాటింగ్ కి సింధు పెద్ద ఫ్యాన్ కాగా.. సింధు ఆటను వార్నర్ కూడా కొనియాడుతూ ఉంటాడు. తాజాగా వార్నర్  వీడియో చూసి సింధు ఒక చిన్న సలహా ఇచ్చింది. 

భారత్ లో వరల్డ్ కప్ కోసం భారత్ కి వచ్చిన అస్ట్రేలియా జట్టు ప్రస్తుతం కేరళలో ఉంది. వార్మప్ మ్యాచుల్లో భాగంగా ఆసీస్ ఆటగాళ్లు కేరళ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో వార్నర్ ఫిట్ నెస్ చేస్తున్న ఒక వీడియో ఇంస్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసాడు. ఇందులో వార్నర్ తేలికపాటి డంబెల్స్ మోయడం నవ్వు తెప్పించింది. ఈ వీడియో చూసిన సింధు వార్నర్ భయ్యా.. భారీ బరువులు మోస్తున్నారు జాగ్రత్త అని సరదాగా హెచ్చరించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కాగా.. 2022 లో కామన్ వెల్త్ గేమ్స్ సింధు గోల్డ్ మెడల్ గెలిచినప్పుడు వార్నర్ సింధుని అభినందిస్తూ ట్వీట్ చేసాడు. ఇక ఇటీవలే   టీమిండియాతో వన్డే సిరీస్ సందర్భంగా వార్నర్ అశ్విన్ బౌలింగ్ లో రైట్ హ్యాండ్ తిరిగి ఆడినప్పుడు సింధు నవ్వుతూ స్పందించింది. మొత్తానికి ఎప్పుడూ సరదాగా ఉండే వార్నర్ తాజాగా జిమ్ లో తేలికైన డంబుల్స్ మోస్తూ అందరిని నవ్వించే పనిలో ఉన్నాడు.