సింగపూర్ ఓపెన్ లో సింధు, ప్రణయ్ జోరు

సింగపూర్ ఓపెన్ లో సింధు, ప్రణయ్ జోరు

సింగపూర్ ఓపెన్ 2022లో పీవీ సింధు  క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. సెకండ్ రౌండ్లో పీవీ సింధు వియత్నాం ప్లేయర్, ప్రపంచ 59వ ర్యాంకర్  థుయ్ లిన్ న్గుయెన్ పై 19-21, 21-19, 21-18 స్కోరు తేడాతో విజయం సాధించింది. 

హోరా హోరీగా..
గంటా 6 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో పీవీ సింధు, థుయ్ లిన్  నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఆరంభం నుంచే వియత్నాం ప్లేయర్ సింధుపై విరుచుకుపడింది. బలమైన షాట్లతో ఆధిపత్యం సాధించింది. ఇదే క్రమంలో 21–19తో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. ఫస్ట్ గేమ్ను కోల్పోయిన సింధు..రెండో గేమ్లో పుంజుకుంది. అద్భుతమైన స్మాష్లతో రెచ్చిపోయింది. అటు ప్రత్యర్థి కూడా సింధు షాట్లకు సమాధానం ఇచ్చింది. అయితే కీలక సమయంలో తప్పిదాలు చేయడంతో..రెండో గేమ్ను పీవీ సింధు 21-19తో గెలుచుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్లోనూ సింధు ఇదే జోరును కొనసాగించి 21–18తో గేమ్ ను ..మ్యాచ్ను సొంతం చేసుకుంది. 

ప్రణయ్ ముందంజ..
మెన్స్ సింగిల్స్లో హెచ్.ఎస్ ప్రణయ్ రెండో రౌండ్కు చేరుకున్నాడు. ఫస్ట్ రౌండ్లో అతను చైనీస్ తైపీకి చెందిన చు టిన్ చెన్పై  14-21 22-20 21-18  స్కోరు తేడాతో గెలుపొందాడు. గంటా 9 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో ప్రణయ్ మ్యాచులో గెలిచేందుకు శ్రమపడ్డాడు. మొదటి గేమ్లో ఓడిపోయిన ప్రణయ్..రెండో గేమ్ను కష్టపడి గెలిచాడు. ఇక చివరి గేమ్లోనూ అనుభవాన్నంత ఉపయోగించి ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. అతను రెండో రౌండ్ లో జపాన్ కు చెందిన కొడాయ్ నరోకాతో తలపడనున్నాడు.