
న్యూఢిల్లీ: ఈ సీజన్లో వరుస టోర్నీల్లో నిరాశపరుస్తున్న ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ దిగజారింది. 2013 తర్వాత తొలిసారి టాప్10లో ప్లేస్ కోల్పోయింది. మంగళవారం రిలీజ్ చేసిన తాజా జాబితాలో రెండు స్థానాలు కిందకు పడి 11వ ర్యాంక్‌లో నిలిచింది. . మెన్స్ సింగిల్స్‌లో ప్రణయ్ 8వ ర్యాంక్‌లో ఉండగా, కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ వరుసగా 21వ, 25వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. డబుల్స్‌లో స్విస్ ఓపెన్ విన్నర్స్ సాత్విక్–చిరాగ్ షెట్టి.. ఆరో ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకున్నారు. విమెన్స్ డబుల్స్‌లో ట్రీసా జాలీ–పుల్లెల గాయత్రి 18వ ర్యాంక్‌లో ఉన్నారు.