బంగారు పతకం సాధించిన మన బంగారం

బంగారు పతకం సాధించిన మన బంగారం

ఏపీ క్రీడా శాఖ మంత్రి పీవీ సింధు ఇంట్లో స్టార్ షట్లర్ పీవీ సింధు మెరిశారు. తల్లిదండ్రులతో పాటు సోదరిని కూడా వెంటబెట్టుకుని రోజా ఇంటికి వెళ్లారు. అక్కడ మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ విషయాన్ని మంత్రి రోజా ట్వీట్ ద్వారా తెలిపారు. ‘బంగారు పతకం సాధించిన మన 'బంగారం' సింధు తన కుటుంబంతో వచ్చి నన్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబంతో కలసి సింధు కుటుంబసభ్యులతో లంచ్ చేయడం జరిగింది’. అంటూ రోజా ట్వీట్ లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇటీవలే కామన్ వెల్త్ గేమ్స్ ముగిశాయి. ఆగస్టు 08వ తేదీన జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో సింధు అద్భుతంగా ఆడి కెనడాకు చెందిన మిచెల్లీ లీపై ఘనవిజయం సాధించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో సింధు 21–15, 21–13 తో అలవోకగా నెగ్గి బంగారు పతకం సాధించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది. ఈ స్వర్ణంతో 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 56 పతకాలు సాధించింది. అందులో 19 స్వర్ణాలు ఉండగా 15 రజతాలు, 22 కాంస్యాలు ఉన్నాయి. మరోవైపు... భారత హాకీ సభ్యురాలు ఏపీ క్రీడాకారిణి రజిని కూడా ఏపీ మంత్రి రోజాను కలిశారు. రజినిని రోజా ఘనంగా సన్మానించారు.