
గ్వాలియర్: కరోనా లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్న 25 ఏళ్ల మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) సిబ్బంది ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు వివరాలు పోలీసులు శనివారం మీడియాకు తెలిపారు. హర్యానాలోని పానిపట్ కు చెందిన దిలీప్(25) గ్వాలియర్‌లోని మహారాజ్‌పురా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఫిట్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో కొద్ది రోజుల కిందట మిలటరీ ఆసుపత్రికి వెల్లగా క్వారంటైన్‌కు తరలించారు. శనివారం ఉదయం తన రూంలోంచి దిలీప్ ఎంతసేపటికీ బయటికి రాకపోయేసరికి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కు వెళ్లి పరిశీలించగా దిలీప్ ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడని జిల్లా సూపరింటెండెంట్ రవి బదౌరియా తెలిపారు. సూసైడ్ కు ఎలాంటి కారణాలు తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.