హోమ్‌ క్వారంటైన్‌తో మెంటల్ డిస్టర్బెన్స్..తమిళనాడులో ఒకరు సూసైడ్​

హోమ్‌ క్వారంటైన్‌తో మెంటల్ డిస్టర్బెన్స్..తమిళనాడులో ఒకరు సూసైడ్​

చెన్నై : తమిళనాడులో హోమ్ క్వారంటైన్ లో ఉన్న కొంతమంది ఆగమాగం చేస్తున్నారు. ఒంటరిగా ఉండలేక పిచ్చి చేష్టాలకు పాల్పడుతున్నారు. శనివారం ఒక్కరోజే ఓ వ్యక్తి హోమ్ క్వారంటైన్ లో ఉండలేక సూసైడ్ చేసుకోగా మరో వ్యక్తి మెంటల్ గా డిస్ట్రబ్ అయి బరిబతల బయటకు ఉరికిండు. అంతటితో ఆగకుండా ఓ వృద్ధురాలిపై ఎటాక్ చేసి ఆమె చావుకు కారణమయ్యాడు. మరో వ్యక్తి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంటూ హోంమినిస్ట్రీకి ట్వీట్ చేశాడు. తేని జిల్లాలో 34 ఏళ్ల ఓ వ్యక్తి వారం క్రితం శ్రీలంక నుంచి వచ్చాడు. హోం క్యారంటైన్ లో ఉండలేక మెంటల్ గా డిస్ట్రబ్ అయి  బట్టలు లేకుండా ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టిండు. ఈ క్రమంలో ఇంటి బయట నిద్రిస్తున్న 90 ఏళ్ల నచియమ్మల్ గొంతుపై ఎటాక్ చేశారు.  ఆమె అరుపులు విని బయటికి వచ్చిన కుటుంబ సభ్యులు, స్థానికులు.. ఆ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వృద్ధురాలిని హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

హోమ్‌ క్వారంటైన్‌లో ఉండలేక సూసైడ్‌

పుడుక్కొట్టై జిల్లా మరమడక్కి  గ్రామం  సురేష్  (29) అనే వ్యక్తి హోమ్ క్వారంటైన్ లో ఉండలేక సూసైడ్ చేసుకున్నాడు. జనవరిలో మాల్దీవుల నుంచి తిరిగి వచ్చిన సురేష్ ఆ తర్వాత కొన్ని నెలల పాటు తిరుపూర్ కు జాబ్ కోసం వెళ్లాడు. వారం కిందటే సొంతూరు వచ్చాడు. అతని కరోనా వచ్చిందన్న అనుమానంతో కుటుంబ సభ్యులు ఐసోలేషన్ లో ఉండాలని ఫామ్ హౌస్​ కు పంపించారు. దీంతో డిప్రెషన్ కు లోనైన సురేష్ ఉరి వేసుకొని చనిపోయాడు.

ఆత్మహత్య ఆలోచనలంటూ ట్వీట్

కొయంబత్తూర్ లో హోమ్ క్వారంటైన్ లో ఉండలేక ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయని ట్వీట్ చేసిన వ్యక్తిని పోలీసులు రెస్క్యూ చేశారు.  ప్రైవేట్ బ్యాంకు లో పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్.. ఇంట్లో ఒక్కడినే ఉండలేకపోతున్నానని,
ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయని తన ట్వీట్ ను హోం మినిస్ట్రీ కి ట్యాగ్ చేశాడు. దీంతో పోలీసులు వెంటనే వెళ్లి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ధైర్యం చెప్పారు.

పుణె నర్సుకి ప్రధాని థ్యాంక్స్