వైభవంగా క్వారీ దుర్గాదేవి జాతర

వైభవంగా క్వారీ దుర్గాదేవి జాతర

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల ఏసీసీ క్వారీలోని దుర్గాదేవి జాతర ఆదివారం వైభవంగా జరిగింది. దుర్గాదేవిని అలంకరించి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలు బోనాలతో వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న పోచమ్మ, నాగదేవత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి దుర్గాదేవిని దర్శించుకొని పూజలు చేశారు.