
న్యూఢిల్లీ : క్విక్ కామర్స్ కంపెనీ జెప్టో తాజా ఫండింగ్ రౌండ్‌లో 665 మిలియన్ డాలర్లు (రూ.5,560 కోట్లు) సేకరించింది. కంపెనీ వాల్యుయేషన్ మూడు రెట్లు పెరిగి 3.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాది కాలంలో 235 మిలియన్ డాలర్లను 1.4 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ దగ్గర జెప్టో సేకరించింది.
తాజా ఫండింగ్ రౌండ్‌లో కొత్త ఇన్వెస్టర్లు వెనిర్, లైట్‌స్పీడ్, అవ్రా, ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్, గుడ్‌వాటర్, లేచి గ్రూమ్ వంటి సంస్థలు పాల్గొన్నాయి. కేవలం 29 నెలల్లోనే తమ సేల్స్ సున్నా నుంచి బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని జెప్టో సీఈఓ అదిత్ పలిచా పేర్కొన్నారు.