బిట్ బ్యాంక్  : కుతుబ్​షాహీలు

బిట్ బ్యాంక్  : కుతుబ్​షాహీలు

                     

 •     కుతుబ్​షాహీల కాలం నాటి సమాజంలోని వివిధ కులాల వారి వేషభాషలు, ఆహారపు అలవాట్లు, సంప్రదాయాలను వివరించే శుకసప్తతిని పాలవేకిరి కదరీపతి రచించాడు.
 •     బ్రాహ్మణులు భుజంపై వేసుకునే మడి పంచెను ధావళి అనేవారు.
 •     మల్హణ చరిత్రను పెదపాటి ఎర్రనార్యుడు రచించాడు.
 •     తానీషా ప్రభుత్వం వేశ్యావాటికల నిర్వహణకు ఖజానా నుంచి 3.24లక్షలు ఖర్చు చేసిందని గిర్ధారీలాల్​ రాశాడు.
 •     గోల్కొండ రాజ్యంలోని ముస్లింల వేషధారణ ఎలా ఉండేదో వర్ణించిన 17వ శతాబ్దానికి చెందిన గోగుపాటి కూర్మనాథుని రచన సింహాద్రి నారసింహ శతకం.
 •     పూరీ జగన్నాథ యాత్రలో రథచక్రాల కింద బలవంతంగా పడి ప్రాణాలు వదిలితే మోక్షం లభిస్తుందని నమ్మేవారని ఫ్రెంచి యాత్రి ఫ్రాంకోయిస్​ బెర్నియర్​ పేర్కొన్నాడు.
 •     కుతుబ్​షాహీల కాలంలో స్థానిక అధికారులు సతి ఆచారాన్ని ప్రోత్సహించారని పేర్కొన్న థామస్​ బేరీ రచన ఎ జాగ్రఫికల్​ అకౌంటింగ్​ ఆఫ్​ ది కంట్రీస్​ ఎ రౌండ్​ ది బే ఆఫ్​ బెంగాల్​.
 •     కుతుబ్​షాహీల కాలం నాటి ముఖ్య పండుగలు దసరా, దీపావళి, హోళీ, రంజాన్​, బక్రీద్​, నవ్​రోజ్​, మొహర్రం.
 •     పొన్నగంటి తెలగనార్యకవి రచన యయాతి చరిత్ర.
 •     గోల్కొండ రాజ్యంలో మచిలీపట్నం కేంద్రంగా  మధ్య ఆసియా, ఐరోపా దేశాలతో భారీ ఎత్తున విదేశీ వ్యాపారం సాగేది.
 •     కుతుబ్​షాహీల కాలంలో వ్యవసాయ భూములు రెండు రకాలు. అవి.. జమిందారీ భూములు, హవేలి భూములు.
 •     హైదరాబాద్​లోని సైఫాబాద్​ పరిసరాల్లో రాజమాత మా సాహెబా(ఖానం ఆఘా) ఒక చెరువును తాగునీటి కోసం తవ్వించారు. దానిని మా సాహెబ్​ ట్యాంక్​ అని పిలిచేవారు.
 •     క్రీ.శ.1551 నాటి ఒక శాసనం ప్రకారం ఇబ్రహీం కులీ కుతుబ్​ షా ఉదయ సముద్రం, పొనగల్​ చెరువులకు మరమ్మతులు చేయించారు.
 •     దశబంధువు భూముల్లో భూమి శిస్తు 1/10 వంతు వసూలు చేసేవారు.
 •     కుతుబ్​షాహీల కాలంలో దేశీయ, విదేశీయ వ్యాపారంలో కోమట్లు కీలక పాత్ర పోషించారు.
 •     కుతుబ్​షాహీలకు మేలు రకం గుర్రాలను అరబ్​, పోర్చుగీసు వర్తకులు సరఫరా చేశారు.
 •     ఐరోపా వర్తక సంఘాలు ప్రవేశించిన తర్వాత గొప్ప వర్తక కేంద్రాలుగా నరసాపురం, మచిలీపట్నం, గోల్కొండ, మద్రాసు, కొండపల్లి రూపొందాయి.
 •     కుతుబ్​షాహీల కాలంలో జరిగే సముద్రాలపై జరిగే విదేశీ వ్యాపారాన్ని ఓడబేరం అని పిలిచేవారు.
 •     కుతుబ్​షాహీల కాలంలో విదేశీ వ్యాపారానికి ముఖ్య కేంద్రాలు మోటుపల్లి, నరసాపురం, మచిలీపట్నం.
 •     ఐరోపా దేశాలకు మేలు రకం వస్త్రాలను మచిలీపట్నం నుంచి ఎగుమతి చేసేవారు. 
 •     కుతుబ్​షాహీల కాలం నాటి సాహిత్యంలో పేర్కొన్న ఇద్దరు సంపన్న వర్తకులు వసుమత, విష్ణుదాస.
 •     ఓడల నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు నర్సాపురం, మచిలీపట్నం.
 •     కుతుబ్​షాహీల కాలంలో ఇనుము, పోత పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని ప్రాంతాలు నిర్మల్​, ఇందల్​వాయి.
 •     గోల్కొండ రాజ్యంలో ముఖ్య కరెన్సీ హోన్న అనే బంగారు నాణెం.
 •     గోల్కొండ రాజ్య కరెన్సీ అయిన హోన్నును విదేశీ వర్తకులు పగోడ అనే పేరుతో పిలిచేవారు.
 •     హోన్నుతోపాటు గోల్కొండ రాజ్యంలో చెలామణిలో ఉన్న ఇతర నాణేలు పణం, తార్​, కాసు.
 •     కుతుబ్​షాహీల కాలం నాటి ఎగుమతుల్లో ముఖ్యమైనవి వస్త్రాలు, వజ్రాలు, సూరేకారం, తివాచీలు, నీలిమందు, మేలురకం కత్తులు.
 •     కుతుబ్​షాహీల కాలం నాటి ముఖ్యమైన దిగుమతులు గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, బంగారం, సీసం, ఖర్జూర పండ్లు, కస్తూరి, పింగాణీ పాత్రలు, గవ్వలు.
 •     కుతుబ్​షాహీల కాలంలో మేలు రకపు వజ్రాలకు నిలయాలైన గనులు గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలోని కొల్లూరు, కర్నూలు జిల్లాలోని రామళ్లకోట.
 •     క్రీ.శ.1640లో కొల్లూరు గనిలో 60వేల పనివారు ఉండేవారని విదేశీ యాత్రికుడు ఫ్రెంచికి చెందిన టావెర్నియర్​ తెలిపాడు.
 • -    హైదరాబాద్​లో వజ్రాలకు సానపెట్టే పరిశ్రమ కార్వాన్​లో ఉండేది.
 •     ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్​ వజ్రం అబ్దుల్లా కుతుబ్​షా కాలంలో క్రీ.శ.1656లో కొల్లూరు వజ్రపు గనిలో లభించింది. 
 •     కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్​ మహారాణి విక్టోరియాకు బహుమతిగా లార్డ్​ లారెన్స్​ ఇచ్చారు.