రాష్ట్ర సర్కారు భూములు అమ్మకుండా కేంద్రం చట్టం తేవాలె : ఆర్. కృష్ణయ్య

రాష్ట్ర సర్కారు భూములు అమ్మకుండా కేంద్రం చట్టం తేవాలె : ఆర్. కృష్ణయ్య

రాష్ట్రంలోని వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం అమ్మకుండా కేంద్రం చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయాల పేరుతో నాయకులు భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుండటంతో వేల కోట్లు దండుకుంటున్నారని విమర్శించారు. మియాపూర్లోని 50 ఎకరాల స్థలాన్ని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కు కేసీఆర్ కేటాయించడాన్ని కృష్ణయ్య తప్పుబట్టారు.

బీసీ గురుకులాలకు సొంత భవనాలు లేక బీసీలు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కృష్ణయ్య మండిపడ్డారు. ప్రభుత్వభూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. రు. ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, అక్రమించినా బీసీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.