
మాధవన్..లవర్ బోయ్‌గా ఇంప్రెస్ చేశాడు. మెచ్యూర్డ్ యాక్టర్‌గా మెస్మరైజ్ చేశాడు. రైటర్‌గా టాలెంట్ చూపించి, డైరెక్టర్‌గా కూడా సత్తా చాటాడు. మాధవన్ యాక్టర్ గానే కాదు..అతని వ్యక్తిత్వంతోనూ అందరి ప్రశంసలు అందుకున్నాడు.
హీరో మాధవన్ ఇటీవల ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కొత్త రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. SquareYards.com సేకరించిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం మాధవన్ ఈ ఆస్తిని రూ.17.5 కోట్లకు కొనుగోలు చేశాడు. ఇది సుమారు 389 చదరపు మీటర్లు (4,182 చదరపు అడుగులు) మరియు రెండు పార్కింగ్ స్థలాలతో ఈ ప్లాట్ వస్తుంది.
ఇకపోతే ఈ ప్రాపర్టీ సిగ్నియా పెర్ల్ లో ఉంది. ఇదొక లగ్జరీ అపార్ట్మెంట్లను సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల కోసం అందించే భవన సముదాయం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ లైఫ్ స్టైల్ కు అనుగుణంగా ప్రీమియం సౌకర్యాలు, ఫీచర్లను అందిస్తుంది. జులై 22న ఖరారు చేసిన సేల్ డీడ్ కు రూ.1.05 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు స్క్వేర్ యార్డ్స్ తెలిపింది.మాధవన్ ఆస్తులలో రూ. 18 కోట్ల విలువైన బంగళా చెన్నైలో కూడా ఉంది.
అయితే అతను తన కుటుంబంతో కలిసి ముంబైలో ఆర్గానిక్ గార్డెనింగ్ కోసం ప్రైవేట్ గార్డెన్‌ను మరియు తనకు ఇష్టమైన ఆట కోసం పూల్ టేబుల్‌ను కలిగి ఉన్న విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. అంతేకాకుండా అతను తన కొడుకు స్విమ్మింగ్ శిక్షణ కోసం దుబాయ్ విల్లాను కూడా అద్దెకు తీసుకున్నాడు. ఎంతైనా తన కుటుంబం మరియు సౌకర్యాల పట్ల ఎల్లప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తుండటంతో అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. రీసెంట్ గా సైతాన్ మూవీలో నెగిటివ్ రోల్ లో కనిపించి శభాష్ అనిపించుకున్న మాధవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.