ప్రజ్ఞానంద, హంపిపై ఫోకస్ .. నేటి నుంచి క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నీ

ప్రజ్ఞానంద, హంపిపై ఫోకస్ .. నేటి నుంచి క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నీ

టోరంటో (కెనడా): ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద, లెజెండరీ ప్లేయర్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెస్ టోర్నీకి రెడీ అయ్యారు. బుధవారం మొదలయ్యే ఈ టోర్నీలో ఇండియా తరఫున మెన్స్, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ ఇద్దరు ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.  ఈ టోర్నీలో ఇండియా నుంచి 35 ఏండ్ల తర్వాత మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముగ్గురు ఆటగాళ్లు పోటీలో నిలిచారు.

ప్రజ్ఞాతో పాటు డి. గుకేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విదిత్ గుజరాతి కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హంపితో పాటు ప్రజ్క్షానంద అక్క ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. వైశాలి బరిలో నిలిచింది.మెన్స్, విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎనిమిదేసి మంది మేటి ప్లేయర్లు పోటీ పడుతున్నారు. విన్నర్లు వరల్డ్ చెస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్వాలిఫై అవుతారు.