
సౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న రాశీఖన్నా నార్త్‌లోనూ సత్తా చాటాలనుకుంటోంది. ఆల్రెడీ హిందీలో రెండు వెబ్ సిరీసులు చేస్తున్న రాశీ.. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘యోధ’ చిత్రంలో నటిస్తోంది. ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి పుష్కర్ ఓఝూ, సాగర్ ఆంబ్రే దర్శకులు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన ఆమె.. రీసెంట్‌గా నెక్స్ట్ షెడ్యూల్‌లో జాయిన్ అయ్యింది. ముంబై పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం షూట్ జరుగుతోంది. తర్వాత ఢిల్లీలోనూ కొంత పార్ట్ షూట్ చేయనున్నట్టు తెలుస్తోంది. దిశాపటాని మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. నవంబర్ 11న రిలీజ్ చేయనున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే అజయ్ దేవగన్‌తో కలిసి రాశీ నటించిన ‘రుద్ర’ వెబ్ సిరీస్ మార్చి4 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీని ప్రమోషన్స్‌లోనూ బిజీగా ఉంది రాశీఖన్నా. ఇక తెలుగులో పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమిళంలో ధనుష్‌తో ‘తిరుచిత్రబలం’, కార్తీ ‘సర్దార్’ చిత్రాల్లో నటిస్తోంది