క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ అరెస్ట్

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఐపియల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటి పోలీసులు పట్టుకున్నారు. బంటు రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద రెడీగా లక్షల రూపాయల నగదు పట్టుపడగా.. మరికొంత డబ్బును ఆన్ లైన్ ద్వారా బ్యాంకుల్లో వేసినట్లు గుర్తించి ఆ డబ్బును కూడా కలిపి మొత్తం 30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజేష్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇతర రాష్ట్రాల నుండి కొంతమంది ఆర్గనైజర్ గా ఏర్పడి ఒక యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బంటు రాజేష్ తెలంగాణ రాష్ట్రానికి ఆర్గనైజర్ గా వ్యవరిస్తున్నాడు. దీనిలో బెట్టింగ్ చేయాలంటే ఒక వెయ్యి రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ద్వారా పర్మిషన్ తీసుకున్నవారికే ఈ యాప్ ద్వారా బెట్టింగ్ చేయడానికి వీలుంటుందని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. రాజేష్ దగ్గర రెడీగా రూ. 10 లక్షల 16 వేర రూపాయల నగదు దొరకగా.. అతను వివిధ బ్యాంక్ లలో వేయించుకున్న 19 లక్షల 89 వేల రూపాయల డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నామని.. అలాగే అతను బెట్టింగ్ కోసం ఉపయోగించిన 5 సెల్ ఫోన్లు, 11 డెబిట్ కార్డులను సీజ్ చేశామని సీపీ మహేష్ భగవత్ వివరించారు.