ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇవాళ్టితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసు..  ఇవాళ్టితో ముగియనున్న రాధాకిషన్ రావు కస్టడీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏప్రిల్ 10 బుధవారంతో టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావు కస్టడీ ముగియనుంది. ఇవాళ రాధా కిషన్ ను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. నాలుగో రోజు కస్టడీలో అస్వస్థతకు గురయ్యారు రాధకిషన్. వైద్య పరీక్షల కోసం గాంధీకి తరలించి.. తర్వాత కోర్టులో హాజరు ప్రవేశపెట్టనున్నారు. వారం రోజులపాటు రాధాకిషన్ రావు ను ప్రశ్నించారు పోలీసులు. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొంతమందిని విచారిస్తున్నారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రాధా కిషన్ వెల్లడించిన వివరాలు కీలకంగా మారాయి.