డార్లింగ్ ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ .. రాధే శ్యామ్ మోషన్ పోస్టర్

డార్లింగ్ ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ప్రైజ్ .. రాధే శ్యామ్ మోషన్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న బర్త్ డే సర్ ప్రైజ్ వచ్చేసింది. రాధా కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న రాధే శ్యామ్  మూవీ నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది టీం. విక్రమ్ ఆదిత్యగా నటిస్తున్న ప్రభాస్.. రన్నింగ్ ట్రెయిన్ లో పూజా హెగ్డేతో డోర్ దగ్గర రొమాంటిక్ గా కనిపిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.

మోషన్ పోస్టర్ తో ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలిసిపోయింది.  జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇతను ఇంతకుముందు తెలుగులో విజయ్ దేవర కొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ప్రభాస్ కు జోడీగా ఈ మూవీలో పూజాహెగ్డే నటిస్తుండగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్, ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. వెటరన్ యాక్టర్ భాగ్రశ్రీ, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.