విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి : రాధిక జైస్వాల్

విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి :  రాధిక జైస్వాల్
  •     జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ అన్నారు. గురువారం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల హక్కులు, బాల్య వివాహాలు, బాలల హక్కుల రక్షణ వంటి అంశాలపై  టీచర్లు విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.

 చట్టాలు ప్రజల రక్షణ కోసమే ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, అడ్వకేట్లు మల్లేశ్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌, ఎడపెల్లి అపర్ణ ఫౌండేషన్ ఆర్గనైజర్ హరీశ్‌‌‌‌‌‌‌‌, టీచర్లు పాల్గొన్నారు.