
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ (Raghava Lawrence) హీరోగా చేస్తున్న తాజా చిత్రం చంద్రముఖి 2 (Chandramukhi 2). రజనీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా వస్తున్న ఆ సినిమాకు పీ వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. వినాయక చవితికి సంధర్బంగా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.
Hi dear friends and fans!
— Raghava Lawrence (@offl_Lawrence) August 24, 2023
Tomorrow is #Chandramukhi2 audio launch. Need all your blessings ?? pic.twitter.com/EWYVy6JWXc
తాజాగా ఈ సినిమా నుండి సూపర్ అప్డేట్ ఇచ్చాడు రాఘవ లారెన్స్. ఆగస్టు 25న చంద్రముఖి 2 ఆడియో లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త పోస్టర్ షేర్ చేశాడు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ కి మీ అందరి ఆశీస్సులు కావాలని ప్రేక్షకులను కోరాడు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. మరి ప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.