విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు, శివబాలాజీ విజయం

విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు, శివబాలాజీ విజయం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈసీ ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. ఆఫీస్ బేరర్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. MAA జనరల్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు గెలుపొందారు. జీవితా రాజశేఖర్‌పై 7ఓట్ల తేడాతో రఘుబాబు విజయం సాధించారు.

'మా' ట్రెజరర్ గా శివబాలాజీ విష్ణు ప్యానల్‌ నుంచి విజయం సాధించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో గెలిచారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా..నాగినీడుకు 284 ఓట్లు వచ్చాయి.