
Raghuram Rajan : భారతదేశంపై అమెరికా 50% సుంకాలు విధించడం "వేకప్ కాల్" అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. అమెరికా ప్రకటించిన టారిఫ్స్ ఎక్కువగా దేశంలోని చిన్న ఎగుమతిదారుల.. ప్రత్యేకంగా టెక్స్ టైల్, రొయ్యలు సహా ఇతరులను తీవ్రంగా దెబ్బతగలవని హెచ్చరించారు. చిన్న వ్యాపారుల జీవితాలతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందని అన్నారు. ఈ చర్య అమెరికా-భారత సంబంధాలకు కూడా భారీ షాక్ అన్న రాజన్.. ప్రస్తుత ప్రపంచంలో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలు రాజకీయాల్లో ఆయుధాలుగా మారుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ 50% టారిఫ్స్ భారత్ ఎక్కువగా ఒకే దేశంపై ఆధారపడకూడదని గమనించాలన్నారు. వాణిజ్య భాగస్వాములను విస్తరించి తూర్పు, యూరప్, ఆఫ్రికా వంటి ప్రాంతాలపై దృష్టి పెట్టాలని.. USతో సంబంధాలు కొనసాగిస్తూ దేశీయ సంస్కరణలు చేపట్టి 8-8.5% వృద్ధి సాధించాలి చెప్పారు రాజన్. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను అమెరికా టార్గెట్ చేసి టారిఫ్స్ ప్రకటించినందున.. భారత్ ఆయిల్ దిగుమతుల వ్యూహంపై పునఃఆలోచన చేయాలని కూడా సూచించారు. ఈ సుంకాల వెనుక కేవలం ఆదాయం మాత్రమే కాదని అమెరికా పెద్దన్నగా తన శక్తిని కూడా ప్రదర్శిస్తోందని.. ఇండియన్ బిజినెస్ లు దీనికి సిద్ధం కావాలని చెప్పారు.
చిన్న ఎగుమతిదారులకు, ముఖ్యంగా వస్త్ర, రొయ్యల, వజ్ర వ్యాపారాలకు కష్టాలు తప్పవని అన్నారు. రష్యా నుంచి తెస్తున్న ఆయిల్ ప్రజలకు పెద్దగా ఉపశమనం కలిగించనప్పటికీ భారత ప్రభుత్వానికి, రిఫైనరీలకు మాత్రం పెద్ద మెుత్తంలో ఆర్జించి పెడుతున్నందున భారత్ ఇతర దేశాల నుంచి క్రూడ్ కొనుగోళ్లకు వెళ్లటం వాణిజ్యాన్ని దెబ్బతినకుండా కాపాడుతుందని సూచించారు రఘురాం రాజన్. ఈ తీరు భారత ఎగుమతిదారులతో పాటు అమెరికాలోని కొనుగోలుదారులపై కూడా ప్రభావం చూపుతుందని ఇది దీర్ఘకాలం సాగితే కొనుగోలుదారులు ఇతర ప్రత్యామ్నాయాలను ఎంచుకునే ప్రమాదం ఉంటుందన్నారు. దీర్ఘకాలంలో భారత్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ తన ఇంధన భద్రత కోసం కేవలం ఒక్క దేశంపైనే ఆదారపడటం భవిష్యత్తులో సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉందని దానిని లీడర్స్ గమనించాలని చెప్పారు. మెుత్తానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రష్యా క్రూడ్ కొనుగోళ్లు ఆపటం మంచిదని ఆయన సూచించారు.
►ALSO READ | ట్రంప్ టారిఫ్స్ భయాల్లో బుల్లిష్ స్టాక్స్: 40 శాతం లాభాన్నిచ్చే 10 స్టాక్స్ లిస్ట్ ఇదే ఇన్వెస్టర్స్