జగన్ పై దాడి: చిన్న గాయానికి 18మంది డాక్టర్లా.. రఘురామరాజు

జగన్ పై దాడి: చిన్న గాయానికి 18మంది డాక్టర్లా.. రఘురామరాజు

శనివారం రాత్రి విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన దాడి రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీల మధ్య మాటల యుద్దానికి దారి తీసింది. దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపిస్తుండగా, ఇదంతా వైసీపీ డ్రామా అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే టీడీపీలో చేరిన వైసీపీ ఎంపీ రఘురామరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న గాయానికి 18మంది డాక్టర్లతో చికిత్స అవసరమా అని అన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి పెద్ద సర్జరీలకే 5, 6మంది డాక్ట్రర్లు ఉంటారని, అలాంటిది చిన్న గాయానికి అంత మంది డాక్టర్లు అవసరమా అని అన్నారు.

ఒక పక్క జగన్ పై జరిగిన దాడిని ఖండిస్తూనే మరో పక్క వ్యంగ్యాస్త్రాలు సంధించాడు రఘురామ. ఈ దాడిని ఖండిస్తున్నానని, ఇలాంటి దాడులు జరగాలని ఎవరూ కోరుకోరని అంటూనే తనకు పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. దాడి జరిగిన సమయంలో లైట్లు ఆపేశారని, లైవ్ కూడా ఆపేశారని, ఆ సమయంలో నిజంగానే ఎవరైనా రాయితో కొట్టారా లేక జగనే గీసుకున్నారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.