ఏపీకి కేటాయించిన ఆఫీసర్లు ఇక్కడే పనిచేస్తున్నరు: రఘునందన్ రావు

ఏపీకి కేటాయించిన ఆఫీసర్లు ఇక్కడే పనిచేస్తున్నరు: రఘునందన్ రావు

ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ లపై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశానని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ విషయంపై ప్రధానమంత్రి కార్యాలయానికి, డీఓపీటీకి కూడా  లేఖ రాశామని చెప్పారు. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్ లు, ఐపీఎస్ లు తెలంగాణలో పనిచేస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన అధికారులు అక్కడే పనిచేయాలని అన్నారు.

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలని రఘునందన్ రావు అన్నారు. డీజీపీని కూడా ఏపీ కేడర్ కు కేటాయించారని.. ఆయనను కూడా అక్కడికే పంపించాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ ల కేటాయింపు కేసుపై ఈ నెల 27న విచారణ జరుగుతుందని చెప్పారు. 13 మందిపై 13 సార్లు వేర్వేరుగా పిటిషన్లు, తీర్పులతో సమయం వృథా కాకుండా ఈ కేసు మొత్తాన్ని ఒకటిగా పరిగణించి తీర్పు ఇవ్వాలని కోరారు.