రాహుల్, ప్రియాంక నాట్ ఇంట్రెస్ట్ .. రాయ్‌బరేలీ, అమేథీ నుంచి పోటీ చేసేదేవరు ?

రాహుల్, ప్రియాంక నాట్ ఇంట్రెస్ట్ ..   రాయ్‌బరేలీ, అమేథీ నుంచి పోటీ చేసేదేవరు ?

గాంధీ కుటుంబానికి కంచుకోటలుగా ఉన్న  రాయ్‌బరేలీ, అమేథీలలో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరాకరించారని తెలుస్తోంది.  దీంతో ఈ స్థానాల్లో పోటీ చేసే  కాంగ్రెస్  పార్టీ అభ్యర్థులు  ఎవరనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.  సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఆమె స్థానంలో రాయ్‌బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ప్రశ్నార్థకమైంది. 

ఒక దశలో ప్రియాంక గాంధీ ఇక్కడినుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదని సమాచారం.  స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి రాయ్‌బరేలీ   నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోట ఉంది. 1952 లో ఇక్కడి నుంచి తొలిసారిగా ఫిరోజ్ ఖాన్ ఎన్నికయ్యారు.   ఆ తరువాత  ఇందిరా గాంధీ,   అరుణ్ నెహ్రూ, సోనియా గాంధీ పోటీ చేస్తూ గెలిచారు.  ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అభ్యర్థిపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

మరోవైపు అమేథీలో ఎవరు పోటీ చేయనున్నారు అన్నది మరో ఇంట్రెస్టి్ంగ్. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన నాలుగు జాబితాల్లో  ఈ స్థానానికి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. తొలి జాబితాలో రాహుల్ గాంధీ మరోసారి కేరళలోని వాయనాడ్  నుంచి బరిలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాహుల్ అమేథీలో  కూడా పోటీ చేస్తారా లేకా  మరో అభ్యర్థికి ఛాన్స్ ఇస్తారో చూడాలి. 

అమేథీ నియోజకవర్గం ముందు నుంచి కాంగ్రెస్  పార్టీకి కంచుకోటగా ఉంది.  1980లో గాంధీ కుటుంబం నుంచి  సంజయ్ సింగ్ పోటీ చేసి గెలిచారు.  ఆ తరువాత  1981లో  రాజీవ్ గాంధీ,  1999 లో సోనియా గాంధీ,  2004,09.14లో రాహుల్ గాంధీ   వరుసగా గెలుస్తూ వచ్చారు.   2019లో మాత్రం బీజేపీ నుంచి స్మృతి ఇరానీ ఇక్కడి నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఎన్నికయ్యారు.