
యావత్మాల్: ‘మహారాష్ట్రలో రాహుల్ గాంధీ అడుగుపెట్టారంటే.. ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం బీజేపీదే విజయం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమర్ఖేడ్లో జరిగిన బహిరంగ సభలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాందేడ్‌లో ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే రాహుల్‌గాంధీ కూడా ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారని తెలిసిందన్నారు. ఆయన ప్రచారంచేస్తే రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.
టెర్రరిజాన్ని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. మోడీ, అమిత్ షాలు కలిసి ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ కాన్సెప్ట్‌ను అమలు చేస్తున్నారని, కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు అందులో భాగమేనని యోగి వివరించారు.