బీబీఎల్‌‌‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ పనికొచ్చింది: ద్రవిడ్‌‌

బీబీఎల్‌‌‌‌ ఎక్స్‌‌పీరియెన్స్‌‌ పనికొచ్చింది: ద్రవిడ్‌‌

అడిలైడ్‌‌‌‌‌‌‌‌‌‌: బిగ్‌‌‌‌బాష్‌‌‌‌ లీగ్‌‌‌‌ (బీబీఎల్‌‌‌‌)లో ఆడిన అనుభవం ఇంగ్లండ్‌‌‌‌ క్రికెటర్లకు ఈ మ్యాచ్‌‌‌‌లో బాగా పనికొచ్చిందని టీమిండియా చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ అన్నాడు. ‘ప్రస్తుతం ఉన్న ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌లో చాలా మంది ప్లేయర్లు ఆసీస్‌‌‌‌లో ఆడారు. సిడ్నీ థండర్స్‌‌‌‌, మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ రెనెగేడ్స్‌‌‌‌కు ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఇక్కడి పిచ్‌‌‌‌లపై వాళ్లకు బాగా అవగాహన ఉంది. కాబట్టే మా బౌలింగ్‌‌‌‌ను ఈజీగా ఎదుర్కోగలిగారు. కానీ మాకు ఆ అవకాశం లేదు’ అని ద్రవిడ్‌‌‌‌ పేర్కొన్నాడు. 

ఫారిన్‌‌‌‌ లీగ్‌‌‌‌ల్లో ఆడేందుకు తమ క్రికెటర్లను అనుమతిస్తే డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌కు చాలా ఇబ్బంది ఎదురవుతుందన్నాడు. అయితే ఏ లీగ్‌‌‌‌ల్లో ఆడాలన్న అంశం పూర్తిగా బీసీసీఐ పరిధిలో ఉంటుందని, దానిపై బోర్డే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నాడు. ఈ మ్యాచ్‌‌‌‌లో తాము పవర్‌‌‌‌ప్లేలో 20 రన్స్‌‌‌‌ తక్కువగా చేశామని ద్రవిడ్‌‌‌‌ అంగీకరించాడు. జట్టు సమష్టిగా రాణించడంలో పూర్తిగా విఫలమైందన్నాడు. భువనేశ్వర్‌‌‌‌, అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ బాల్స్‌‌‌‌ స్వింగ్‌‌‌‌ కాకపోవడం ఓటమికి ప్రధాన కారణమని వెల్లడించాడు.