బీహార్ లో ప్రారంభమైన రాహుల్ ఓట్ అధికార్ యాత్ర

బీహార్ లో ప్రారంభమైన  రాహుల్ ఓట్ అధికార్ యాత్ర

 కాంగ్రెస్ ఎంపీ  రాహుల్ గాంధీ బీహార్ లోని పోల్ బందర్ లో  ఓట్ అధికార్ యాత్ర ప్రారంభించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి ఎంపీలు పాల్గొన్నారు. ఆగస్టు 17 నుంచి 16 రోజుల పాటు ఓట్ అధికార్ యాత్ర జరగనుంది. 25 జిల్లాల్లో 1300 కి.మీ వరకు రాహుల్ యాత్ర చేయనున్నారు. సెప్టెంబర్ 1న పట్నాలో జరిగే భారీ బహిరంగ సభలో యాత్ర ముగియనుంది. 

ఈ సందర్బంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.  రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసమే ఈ పోరాటం అని అన్నారు . మహారాష్ట్రలో కోటి మంది కొత్త ఓటర్లను సృష్టించారని ఆరోపించారు. బీజేపీ చెప్పుచేతల్లో ఈసీ నడుస్తోందన్నారు. ఈసీలను వీడియో క్లిప్పింగ్ లు అడిగినా ఇవ్వలేదన్నారు రాహుల్. మహదేవర పుర అసెంబ్లీ సెగ్మెంట్ లో లక్షకు పైగా నకిలీ ఓట్లు ఉన్నాయన్నారు. బీహార్ లోనూ ఓటు చోరీకి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు రాహుల్. బీహార్ ప్రజలు బీజేపీ ఓటు చోరీని అడ్డుకుంటారని చెప్పారు. పేదల దగ్గరున్న బలం ఓటు ఒక్కటేనన్నారు. బీహార్ లో ఓటు చోరీని ఎలాగైనా అడ్డుకుంటామన్నారు రాహుల్. 

రాహుల్ ఓటర్ అధికార్ యాత్ర షెడ్యూల్ ఇదే.. 

  • ఆగస్ట్ 17 - ససారం, డెహ్రీ ఆన్ సోన్ (రోహ్తాస్)
  • ఆగస్ట్ 18 -  ఔరంగాబాద్, డియో, గురారు
  • ఆగస్ట్ 19 - పునామా వజీర్‌గంజ్, గయా నుండి బార్బిఘా మీదుగా నవాడా
  • ఆగస్టు 20 – సెలవు దినం
  • ఆగస్ట్ 21 - తీన్ మోహని దుర్గా మందిర్, షేక్‌పురా నుండి ముంగేర్ వరకు సికంద్రా, జముయి మీదుగా
  • ఆగస్టు 22 – చందన్ బాగ్ చౌక్, ముంగేర్ నుండి సుల్తాన్‌గంజ్ మీదుగా భాగల్పూర్ వరకు
  • ఆగస్ట్ 23 - బరారి, కుర్సేలా నుండి కోర్హా & కతిహార్ మీదుగా పూర్నియా వరకు
  • ఆగస్ట్ 24 - కుష్కిబాగ్, పూర్నియా నుండి చాందినీ చౌక్, అరారియా మీదుగా నర్పత్‌గంజ్ వరకు
  • ఆగస్టు 25 – సెలవు దినం
  • ఆగస్ట్ 26 - హుస్సేన్ చౌక్, సుపాల్ నుండి ఫుల్పరస్, సక్రి, మధుబని మీదుగా దర్భంగా వరకు
  • ఆగస్ట్ 27 - గంగ్వారా మహావీర్ స్థాన్, దర్భంగా నుండి ముజఫర్‌పూర్ మీదుగా సీతామర్హి వరకు
  • ఆగస్ట్ 28 - రిగా రోడ్, సీతామర్హి నుండి మోతిహారి మీదుగా పశ్చిమ చంపారన్
  • ఆగస్ట్ 29 - బెట్టియా, పశ్చిమ చంపారన్ నుండి గోపాల్‌గంజ్ మీదుగా సివాన్ వరకు
  • ఆగస్ట్ 30 - చాప్రా, సరన్ నుండి అర్రా, భోజ్‌పూర్
  • ఆగస్టు 31 – సెలవు దినం
  • సెప్టెంబర్ 1 - పాట్నాలో యాత్ర ముగింపు