VoteChori.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ.. ఫ్రూఫ్స్ ఇవే అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

VoteChori.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ.. ఫ్రూఫ్స్ ఇవే అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

న్యూఢిల్లీ: మన దేశంలో ఈవీఎం విధానంలో ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సందేహాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన తీరుతెన్నులపై అధ్యయనం చేసి ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామని, హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని రాహుల్ చెప్పారు.

EVMలతో ఎన్నికల నిర్వహణపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంచనాలకు అందని ఫలితాలు వస్తున్నాయని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకి మాత్రమే అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని రాహుల్ డేటాతో సహా వివరించారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారని, బీహార్లో ఓట్ల తొలగింపుపై ఈసీ సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ఒకలా ఉంటే.. ఫలితాలు ఇంకోలా ఉంటున్నాయని చెప్పారు. మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత అత్యధిక పోలింగ్ నమోదు కావడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వాస్తవానికి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల తర్వాత మహారాష్ట్ర పోలింగ్ బూత్ల్లో పెద్దగా క్యూలైన్లు లేకపోయినా భారీగా పోలింగ్ కావడం ఏంటని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారీ పోలింగ్ ఎలా జరిగిందనేది అర్ధం కాని అంశమని, రహస్యాలను ఈసీ ఎందుకు దాస్తోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను బీజేపీ ప్రభావితం చేస్తోందని.. మహారాష్ట్ర, హరియాణ ఫలితాలే ఇందుకు నిదర్శనం అని రాహుల్ ఆరోపించారు.

ALSO READ : బెంగళూరు సెంట్రల్ లోక్సభలో లక్షా 250 ఓట్లు చోరీ.. 

జనాభా కంటే ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, బీజేపీ కోసం ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో 5 నెలలకు ముందే భారీగా ఓటర్లు పెరిగారని, మహారాష్ట్ర అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల మధ్య కోటి మంది కొత్త ఓటర్లు వచ్చారని రాహుల్ ఆరోపించారు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకు పైగా ఫేక్ ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు. అందువల్లే బీజేపీ ఎంపీ పీసీ మోహన్ బెంగళూరు సెంట్రల్ స్థానం నుంచి ఎంపీగా గెలిచారని రాహుల్ ఆరోపణలు చేశారు.