కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర

కేరళలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
  • మోడీ పాలనలో సామాన్యులు బతికే పరిస్థితిలేదు
  • కేరళలో 19వ రోజు రాహుల్ గాంధీ యాత్ర

కేరళలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడ్ యాత్ర కొనసాగుతోంది. 19వ రోజు పాలక్కడ్ జిల్లా షోరనూర్ నుంచి యాత్ర ప్రారంభమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలో  స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోడీ ప్రభుత్వంలో సామాన్య జనం బతికే పరిస్థితి లేదని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వంట గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి పేదవారి నడ్డి విరిచారని ఆరోపించారు. 2014 లో 410 రూపాయలున్న సిలిండర్ ధర... ఇప్పుడు 1200 వందలు చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.