లెటర్ పంపడానికి ఇది సరైన సమయమా?: రాహుల్

లెటర్ పంపడానికి ఇది సరైన సమయమా?: రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పులను కోరుతూ 23 మంది సీనియర్ నేతలు అధినేత్రి సోనియా గాంధీకి లేఖను పంపిన విషయం తెలిసిందే. దీనిపై సోనియా స్పందిస్తూ సదరు లెటర్ రాసిన నేతలనే పార్టీకి కొత్త చీఫ్​ను కనుగొనాలని చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తూ, త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని బాధ్యతల నుంచి తప్పుకోమనడం సబబు కాదని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు.

తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ మాజీ చీఫ్‌ రాహుల్ గాంధీ స్పందించారు. లేఖ పంపడానికి ఇది సరైన సమయమా అని సదరు నేతలను రాహుల్ ప్రశ్నించినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీతో కాంగ్రెస్‌ పోరాడుతున్న తరుణంలో.. పార్టీ చీఫ్‌గా సోనియా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఈ టైమ్‌లో లెటర్‌‌ పంపడం ఏంటంని రాహుల్ నిరాశ వ్యక్తం చేశారని సమాచారం. కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలో లెటర్‌‌ పంపడంపై అసంతృప్తి వెలిబుచ్చారని తెలిసింది.