సర్ఫ్రైజ్ విజిట్.. కూరగాయలు, పండ్ల ధరలపై రాహుల్ ఆరా

సర్ఫ్రైజ్ విజిట్.. కూరగాయలు, పండ్ల ధరలపై రాహుల్ ఆరా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగస్టు 1 తెల్లవారుజామున 4 గంటలకు ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిని సందర్శించారు. కూరగాయలు, పండ్ల విక్రయదారులు, వ్యాపారులతో మాట్లాడి కూరగాయలు, పండ్ల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఆకస్మిక పర్యటనలు చేస్తూ.. ఈ సందర్శనలలో డ్రైవర్లు, రైతులు, మెకానిక్‌లు మొదలైన సాధారణ వ్యక్తులను కలుసుకుంటున్నారు. జులై 8న రాహుల్ గాంధీ హర్యానాలోని సోనిపట్ జిల్లాలోని మదీనా గ్రామంలోని ప్రజలతో మమేకమయ్యారు. వ్యవసాయ భూముల్లో పని చేస్తున్న రైతులతో గడిపారు. వరి నాట్లు వేయడంలో కూడా పాల్గొని ట్రాక్టర్ నడుపుతూ పొలాల్లో పని చేసే మహిళా కూలీలు తీసుకొచ్చిన ఆహారాన్ని తిన్నారని రాష్ట్రానికి చెందిన పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 6.40 గంటలకు చిరుజల్లుల మధ్య గాంధీ గ్రామానికి చేరుకుని దాదాపు రెండున్నర గంటలపాటు అక్కడే గడిపినట్లు వారు తెలిపారు.

ఇక జూలై 27 (శనివారం), రాహుల్ గాంధీ కేరళలోని ప్రసిద్ధ కొట్టక్కల్ ఆర్య వైద్యశాలలో తన ఆయుర్వేద వెల్నెస్ చికిత్సను పూర్తి చేసి ఢిల్లీకి బయలుదేరారు. దీనికి సంబంధించిన ఓ పోస్టును కూడా ఆయన ఫేస్‌బుక్ ద్వారా పంచుకున్నారు. ఆసుపత్రిలో ఉండడం ఒక పునరుజ్జీవన అనుభవమని అన్నారు. వైద్యులు, సిబ్బంది తనపై చూపిన ప్రేమ, సంరక్షణకు ధన్యవాదాలు తెలిపారు.