రాహుల్ జీ.. మోడీని ట్విట్టర్‌లోనే విమర్శిస్తే సరిపోదు 

రాహుల్ జీ.. మోడీని ట్విట్టర్‌లోనే విమర్శిస్తే సరిపోదు 

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఎన్సీపీ కలసి ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వికాస్ అఘాడీలో చీలిక వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ వార్తలకు తాజాగా రాహుల్ గాంధీపై శివసేన చేసిన వ్యాఖ్యలు ఊతం ఇస్తున్నాయి. ట్విట్టర్‌లో మాత్రమే రాహుల్ యాక్టివ్‌గా ఉంటారని తన అధికార పత్రిక సామ్నాలో శివసేన విమర్శలు చేయడం గమనార్హం. ప్రధాని మోడీపై రాహుల్ ట్విట్టర్‌లో మాత్రమే విమర్శలు చేస్తారని, కానీ బయటికొచ్చి అన్ని విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు యత్నించరని సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన చురకలు అంటించింది. ట్విట్టర్ తనకు అనుకూలంగా పని చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం గమనించిందని.. అందుకే ఆ సంస్థపై చర్యలు తీసుకోవడం ప్రారంభించిందని ఆరోపించింది. ఇకపై మహారాష్ట్రలో తాము ఒంటరిగానే ఉంటామని కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ మీద శివసేన పైవ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది.