ప్రజల గొంతును వినడానికి సిద్ధంగా ఉన్నాం

ప్రజల గొంతును వినడానికి సిద్ధంగా ఉన్నాం

భారత్ లో పరిస్థితులేమీ బాలేవన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రజలు, రాష్ట్రాలు, మతాలను ఏకతాటిపైకి తేవాల్సిన అవసరం కాంగ్రెస్ కు ఉందన్నారు రాహుల్ గాంధీ. కేంద్రం ప్రజా గొంతుకను నొక్కుతుందన్న ఆయన తాము మాత్రం ప్రజల గొంతుకను వినడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

దేశ గత వైభవం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని..ఈ నేపథ్యంలోనే బీజేపీకి, కాంగ్రెస్ కు మధ్య సైద్ధాంతిక యుద్ధం నడుస్తోందని చెప్పారు.  బీజేపీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని...ఓట్ల కేంద్రీకరణ వైపు బీజేపీ దృష్టి సారిస్తోందని విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్ ను కేవలం ఓ భూభాగంగానే చూస్తాయని,తాము మాత్రం దేశాన్ని ప్రజల రూపంలో కొలుస్తామని రాహుల్ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తల కోసం

రైల్వే ట్రాక్ లే వారి నివాసాలు 

మంకీపాక్స్ అంటే ఏమిటీ..ఈ వ్యాధి ఎలా సోకుతోంది..?