బ్యాటింగ్ చేసిన రాహుల్‌గాంధీ

బ్యాటింగ్ చేసిన రాహుల్‌గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్యాటింగ్ తో బరిలోకి దిగారు. బౌలర్లు వేసిన ప్రతీ బాల్ ను దీటుగా  ఎదుర్కొన్నారు. శుక్రవారం మహారాష్ట్ర, హర్యాణాలోని మహేంద్రగఢ్‌ అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల సమావేశంలో సోనియాగాంధీ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆరోగ్యం సహకరించకపోవటంతో ఆమె హాజరు కాలేకపోయారు. సోనియాకు బదులుగా రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారం ముగించుకొని తిరిగి తన హెలికాప్టర్‌లో బయలుదేరగా వాతావరణం అనుకూలించక చాపర్‌ రివాడీలోని కేఎల్పీ కాలేజీ గ్రౌండ్ లో అత్యవసరంగా దించారు. అదే సమయంలో అక్కడ మైదానంలో యువకులు క్రికెట్‌ ఆడుతుండటంతో రాహుల్‌గాంధీ కూడా కాసేపు క్రికెట్‌ ఆడారు. యువకులు బౌలింగ్‌ చేయగా…రాహుల్‌గాంధీ బ్యాటింగ్‌ చేశారు. ఆ సమయంలో అక్కడవున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు వీడియోతీసి సోషల్‌ మీడియాలో అప్‌లొడ్‌చేశారు. అయితే చాలా సమయం వరకు వెదర్ అనుకూలించకపోవడంతో రాహుల్‌గాంధీ రోడ్డు మార్గాన ఢిల్లీ వెళ్లారు.