
2024 లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల గోల్ మాల్.. ఎన్నికల సంఘం నిర్వాకం.. దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు రాహుల్ గాంధీ. వారం క్రితం.. ఈసీపై బాంబు పేల్చుతానంటూ ప్రకటించిన రాహుల్.. అన్నట్లుగానే ఓటర్ల లిస్టులోని తప్పులను ఆధారాలతో సహా వెల్లడించారు.
కర్నాటక రాష్ట్రం బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గంలోని మహదేవ్ పూర్ సిటీలో నమోదైన ఓటరు లిస్టులోని గోల్ మాల్ ను బయటపెట్టారు రాహుల్ గాంధీ.
>>> ఇంటి నెంబర్ 35, సింగిల్ బెడ్ రూం అపార్ట్ మెంట్ ప్లాట్.. ఈ అడ్రస్ లో 80 ఓట్లు నమోదు అయ్యాయి. ఇది పోలింగ్ బూత్ నెంబర్ 470 కిందకు వస్తుంది. ఓ సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఎలా ఉంటారు.. ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు.
ALSO READ :VoteChori.. ఈసీపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణ..
>>> అదే ఏరియా.. అదే మహదేవ్ పూర్. ఇంటి నెంబర్ 791. ఇది కూడా సింగిల్ బెడ్ రూం హౌస్. ఈ అడ్రస్ కింద 46 ఓట్లు నమోదు అయ్యి ఉన్నాయి. ఇది పోలింగ్ బూత్ నెంబర్ 366 పరిధిలోకి వస్తుంది.
ఇవన్నీ దొంగ ఓట్లు అని.. ఆ ఇంటికి వెళ్లి మరీ విచారించాం అని.. ఇందుకు వీడియో సాక్ష్యంగా కూడా ఉందన్నారు రాహుల్ గాంధీ. ఓటర్ల లిస్టులో నమోదైన ఓటర్లు అస్సలు ఎవరూ ఆ ఇళ్లల్లో ఉండటం లేదని.. అసలు వారు లోకల్ పీపుల్ కాదని విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
ఇలాంటి దొంగ ఓట్లు.. ఓ అసెంబ్లీ నియోజకవర్గంలోనే 10 వేల 452 నమోదు అయ్యాయని.. ఇవన్నీ దొంగ ఓట్లు అని.. 2024 లోక్ సభ ఎన్నికల ఓటరు లిస్టుల్లో కనిపించాయన్నారు రాహుల్. దీనిపై ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఇదంతా బీజేపీ ఆడుతున్న డ్రామా అని.. ఎన్నికల్లో అక్రమాలు చేసి గెలుస్తుందని ఆరోపించారాయన.