మీ రిక్వెస్ట్ ను నార్వే అంగీకరించిందా మోదీజీ..నార్వేటూర్ పై రాహుల్ గాంధీ సెటైర్లు

మీ రిక్వెస్ట్ ను నార్వే అంగీకరించిందా మోదీజీ..నార్వేటూర్ పై రాహుల్ గాంధీ సెటైర్లు

ప్రధానమోదీ నార్వే టూర్ పై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సెటైరికల్ గా విమర్శించారు. మోదీజీ ..పెన్షన్ నిధి బ్లాక్ లిస్టునుంచి అదానీని తొలగించాలని మీరు చేసిన రిక్వెస్ట్ ను నార్వే ఒప్పుకుందా అంటూ సెటైర్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ టూర్ దేశం కోసం..ఆయన ఫ్రెండ్ అదానికోసం అని విమర్శలు గుప్పించారు. ఇండియా, నార్వే జెండాలతో కూడిన  పోస్టులో గతంలో నార్వే అదానీ గ్రీన్ ఎనర్జీని బ్లాక్ పెట్టిన న్యూస్, ప్రస్తుతం మోదీ పర్యటన గురించి హైలైట్ చేస్తూ X లో పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పర్యటన వెనక దాగివున్న అసలు నిజం ఇదా అంటూ కామెంట్స్ చేశారు. 

ఈ పోస్టులో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. మీమ్స్,  ఫోటోలు షేరింగ్, కామెంట్లతో  కామెంట్ బాక్సులను నింపేశారు. మోదీ పర్యటన వెనక అసలు రహస్యం ఇదా అంటూ కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2026 ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లను నార్వే తొలగించడం. ఆ వ్యవహారం చక్కబెట్టేందుకు మోదీ నార్వే పర్యటనకు వెళ్లారని..ఆయన ఏది చేసినా ముందస్తు ప్లాన్ తోనే చేస్తారని సెటైర్లు వేశారు. 

ఇక కొందరు.. అదానీ నా నమ్మకం, నా మిత్రుడు, నా ప్రాణం.. విదేశీ పర్యటన కేవలం ఒక సాకు మాత్రమే, ఒక మిత్రుడి వ్యాపారాన్ని కాపాడటానికి నేను అక్కడి వెళ్లాను.. జై శ్రీ అదానీ అంటూ సెటైరికల్ పోస్ట్ లు షేర్ చేశారు. 

ALSO READ : కారు నడిపిన సీఎం విజయ్..

2026 ఫిబ్రవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్  (AGEL) ను ప్రపంచంలోనే అతిపెద్దైన 1.2ట్రిలియన్ డాలర్ల  తన సావరిన వెల్త్ ఫండ్ (sovereign wealth fund) నుంచి తొలగించింది నార్వే. ఆర్థికనేరాల ఆరోపణలతో  AGELను  తన పోర్ట్ ఫోలియో నుంచి తొలగించాలని నిర్ణయించింది.  దీంతో పాటు 2024మేలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌ను నార్జెస్ బ్యాంకు బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ క్రమంలో ప్రధాని మోదీపర్యటనపై రాహుల్ గాంధీ సెటైరికల్ పోస్టులు చేయడం ఆసక్తికరంగా మారింది.