నీ అయ్య.. నా సాలా.. యూట్యూబ్ను షేక్ చేస్తున్న రాహుల్ కొత్త పాట

నీ అయ్య.. నా సాలా.. యూట్యూబ్ను షేక్ చేస్తున్న రాహుల్ కొత్త పాట

రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj).. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరంలేదు. తన వైవిధ్యమైన గొంతుతో తెలుగులో పాటలు పాడుతూ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు ఈ కుర్ర సింగర్. ఇటీవలే ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో రాహుల్ పాడిన నాటు నాటు(Naatu naatu) సాంగ్ కు ఆస్కార్ అవార్డు(Oscar award) వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆస్కార్ వేదికపై నాటు నాటు లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్.

ఓపక్క సింగర్ గా కంటిన్యూ అవుతూనే.. మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పటికే మనోడు చేసిన సాంగ్స్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఆడియస్న్ కూడా రాహుల్ పాటలంటే పిచ్చెక్కిపోతారు. మరీ ముఖ్యంగా యూత్.    

ఇందులో భాగంగానే తాజాగా రాహుల్ మరో ప్రైవేట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నీ అయ్య.. నా మామ.. అంటూ సాగిన ఈ పాట రీసెంట్ రిలీజ్ అయ్యింది. దుబాయ్ లో తెరకెక్కించిన ఈ సాంగ్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ను షేక్ చేస్తోంది. ఫారెన్ భామల మధ్య రాహుల్ చేసిన రచ్చకి మాస్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రాహుల్ నెక్స్ట్ లెవల్ టాలెంట్, సాంగ్ సూపర్, తెలుగు నుండి వచ్చిన ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ సాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీలుంటే మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read :- OTTలో ఆర్య హారర్ వెబ్ సిరీస్.. ఆ విలేజ్లో ఎం జరిగిందంటే?

  • Beta
Beta feature