తెవాటియా 6, 6

తెవాటియా 6, 6
  • చివరి రెండు బాల్స్‌‌‌‌కు సిక్సర్లు కొట్టిన రాహుల్‌‌
  • శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ అద్భుత ఇన్నింగ్స్‌‌

ముంబై: ఐపీఎల్‌‌‌‌లో రాహుల్‌‌ తెవాటియా (3 బాల్స్‌‌లో 13నాటౌట్‌‌) మరోసారి మ్యాజిక్‌‌ చేశాడు. చివరి రెండు బాల్స్‌‌లో 12 రన్స్‌‌ అవసరమైన టైమ్‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టేసి కొత్త టీమ్‌‌ గుజరాత్‌‌ టైటాన్స్‌‌ను గెలిపించాడు. మరో యంగ్‌‌స్టర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (59 బాల్స్‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 96) అద్భుత ఇన్నింగ్స్‌‌తో సత్తా చాటడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌లో  గుజరాత్‌‌ 6 వికెట్ల తేడాతో పంజాబ్‌‌ కింగ్స్‌‌ను ఓడించి లీగ్‌‌లో హ్యాట్రిక్‌‌ విక్టరీ సాధించింది. తొలుత పంజాబ్‌‌ 20 ఓవర్లలో 189/9 స్కోరు చేసింది.  లివింగ్‌‌స్టోన్‌‌ (27 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) ఫిఫ్టీ కొట్టాడు.  రషీద్‌‌  ఖాన్‌‌ (3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం టైటాన్స్‌‌ 20 ఓవర్లలో 190/4 స్కోరు చేసి గెలిచింది. రబాడ (2/35) రెండు వికెట్లతో రాణించాడు. గిల్​ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌గా నిలిచాడు.

లివింగ్‌‌స్టోన్‌‌ ధనాధన్‌‌
టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన పంజాబ్‌‌కు లివింగ్‌‌స్టోన్‌‌ మంచి స్కోరు అందించాడు. తొలి ఐదు ఓవర్లలోనే  కెప్టెన్‌‌ మయాంక్‌‌ (5),  బెయిర్‌‌ స్టో (8) వెనుదిరిగినా ధవన్‌‌ (35)తో కలిసి లివింగ్‌‌స్టోన్‌‌ భారీ షాట్లతో రెచ్చిపోయాడు. దర్శన్‌‌ వేసిన పదో ఓవర్లో సిక్స్‌‌, రెండు ఫోర్లతో విజృంభించాడు.  కానీ, తర్వాతి ఓవర్లోనే ధవన్‌‌ను రషీద్‌‌ ఔట్‌‌ చేసి గుజరాత్‌‌కు బ్రేక్‌‌ ఇచ్చాడు. అయితే, తెవాటియా వేసిన 13వ ఓవర్లో జితేశ్‌‌ (23) రెండు సిక్సర్లు, లివింగ్‌‌స్టోన్‌‌ 6,4 సహా 24 రన్స్‌‌ పిండుకున్నారు. ఈ టైమ్‌‌లో దర్శన్‌‌ వరుస బాల్స్‌‌లో జితేశ్‌‌తోపాటు ఒడియన్‌‌ స్మిత్‌‌ (0)ను వెనక్కుపంపినా లివింగ్‌‌స్టోన్‌‌ వెనక్కు తగ్గలేదు. అదే ఓవర్లో తను రెండు ఫోర్లు కొట్టగా.. షమీ బౌలింగ్‌‌లో హిట్టర్‌‌ షారూక్‌‌  (15)  వరుసగా రెండు సిక్సర్లు బాదడంతో 15 ఓవర్లకే 150 దాటింది. అయితే,16వ ఓవర్లో స్పిన్నర్ రషీద్‌‌.. లివింగ్‌‌స్టోన్‌‌, షారూక్‌‌ ఇద్దరినీ ఔట్‌‌ చేసి పంజాబ్‌‌కు బ్రేక్‌‌ వేశాడు.  రబాడ (1), వైభవ్‌‌ అరోరా (2) ఫెయిలైనా.. రాహుల్‌‌ చహర్‌‌ (22 నాటౌట్‌‌ ), అర్షదీప్‌‌ (10 నాటౌట్‌‌)  పోరాటంతో పంజాబ్‌‌ స్కోరు180 మార్కు దాటింది. 

గిల్‌‌ మెరుపుల్‌‌, తెవాటియా ఫినిషింగ్‌‌
పెద్ద టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో ఓపెనర్‌‌ శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ స్టార్టింగ్‌‌ నుంచి దూకుడుగా ఆడటంతో గుజరాత్‌‌ టైటాన్స్‌‌ ఇన్నింగ్స్‌‌ మెరుపు వేగంతో కదిలింది. పవర్‌‌ప్లేను సద్వినియోగం చేసుకున్న గిల్‌‌  అద్భుతమైన  డ్రైవ్స్‌‌, కట్‌‌, పుల్‌‌ షాట్లతో గ్రౌండ్ నలుమూలలా బౌండ్రీలు రాబట్టాడు. వేడ్‌‌ (6)ను రబాడ నాలుగో ఓవర్లో ఔట్‌‌ చేసినా.. వన్‌‌డౌన్‌‌ బ్యాటర్‌‌ సాయి సుదర్శన్‌‌ (35), గిల్‌‌ జోరు కొనసాగించడంతో 14 ఓవర్లకు టైటాన్స్‌‌ 128/1తో నిలిచింది. తర్వాతి ఓవర్లో సాయిని ఔట్‌‌ చేసిన చహర్ రెండో వికెట్‌‌కు 101 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో గుజరాత్‌‌కు 56 రన్స్‌‌ అవసరం కాగా.. చహర్‌‌ బౌలింగ్‌‌లో  వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కెప్టెన్‌‌ హార్దిక్‌‌  (27) టీమ్‌‌పై ఒత్తిడి తగ్గించాడు. కానీ, 18వ ఓవర్లో అర్షదీప్‌‌ ఐదు రన్సే ఇవ్వడంతో మ్యాచ్‌‌లో ఉత్కంఠ పెరిగింది. 19వ ఓవర్లో గిల్‌‌ను ఔట్‌‌ చేసిన రబాడ 13 రన్స్‌‌ ఇవ్వడంతో సమీకరణం 6 బాల్స్‌‌లో 19గా మారింది. ఒడియన్‌‌ స్మిత్‌‌ వైడ్‌‌తో ఆరంభించిన లాస్ట్‌‌ ఓవర్లో తొలి బాల్‌‌కు పాండ్యా రనౌటవగా.. తర్వాతి 3 బాల్స్‌‌కు 1, 4,1 రావడంతో పంజాబ్‌‌ విజయం ఖాయం అనిపించింది. కానీ, ఆఖరి రెండు బాల్స్‌‌ను స్టాండ్స్‌‌కు పంపిన తెవాటియా టైటాన్స్‌‌కు విక్టరీ అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు
పంజాబ్‌: 20 ఓవర్లలో 189/9  (లివింగ్‌స్టోన్‌ 64, ధవన్‌ 35, రషీద్‌ 3/22)
గుజరాత్‌: 20 ఓవర్లలో 190/4 (గిల్‌ 96, రబాడ 2/35)