రైల్వే ప్యాసెంజర్లకు వాట్సాప్‌‌‌‌తో మీల్స్‌‌‌‌

రైల్వే ప్యాసెంజర్లకు వాట్సాప్‌‌‌‌తో మీల్స్‌‌‌‌

న్యూఢిల్లీ: రైల్వే ప్యాసెంజర్లు ఇక నుంచి  వాట్సాప్ ద్వారానే ఫుడ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెట్టొచ్చు. తమ పీఎన్‌‌‌‌ఆర్ నెంబర్‌‌‌‌‌‌‌‌ను వాడుకొని ఈ– కేటరింగ్ సర్వీస్‌‌‌‌లను పొందొచ్చు. రైళ్లలో ప్రయాణిస్తున్నవారి కోసం  ఇండియన్ రైల్వేస్ తాజాగా వాట్సాప్ కమ్యూనికేషన్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేసింది. ఇందుకోసం బిజినెస్‌‌‌‌ వాట్సాప్ నెంబర్‌‌‌‌‌‌‌‌  +91–8750001323 ను తీసుకొచ్చింది. టికెట్స్ బుక్ చేసిన నెంబర్‌‌‌‌‌‌‌‌కు  బిజినెస్‌‌‌‌ వాట్సాప్ నెంబర్‌‌‌‌‌‌‌‌ ఒక మెసేజ్ పంపుతుంది. ఈ మెసెజ్‌‌‌‌లోని  www.ecatering.irctc.co.in  క్లిక్ చేయడం ద్వారా ప్యాసెంజర్లు రైల్వే స్టేషన్‌‌‌‌కు దగ్గరలోని రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌‌‌‌ను ఆర్డర్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఈ సర్వీస్‌‌‌‌లను స్టార్ట్ చేశారు.  రెండో దశ కింద భవిష్యత్‌‌‌‌లో  చాట్ బోట్‌‌‌‌ ఏఐ సర్వీస్‌‌‌‌లను తీసుకురానున్నారు. ఈ చాట్‌‌‌‌బోట్‌‌‌‌ యూజర్లతో ఇంటరాక్ట్ అవుతుంది. ప్యాసెంజర్ల కోసం మీల్స్ బుక్ చేసి పెడుతుంది. ప్రస్తుతానికి సెలెక్ట్ చేసిన కొన్ని రైళ్లలోనే  ఈ–కేటరింగ్ వాట్సాప్ కమ్యూనికేషన్ సర్వీస్‌‌‌‌లను ప్రారంభించారు. దశల వారీగా మిగిలిన ట్రైన్‌‌‌‌లలో కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఐఆర్‌‌‌‌‌‌‌‌సీటీసీ ఈ–కేటరింగ్ సర్వీసెస్‌‌‌‌ ద్వారా రోజుకి 50 వేల మీల్స్‌‌‌‌ను అందిస్తున్నారు.