RRB Recruitment: రైల్వేలో జూనియర్ ఇంజనీర్స్ఉద్యోగాలు..జీతం35వేలు.. అప్లయ్ చేసుకోండిలా

RRB Recruitment: రైల్వేలో జూనియర్ ఇంజనీర్స్ఉద్యోగాలు..జీతం35వేలు.. అప్లయ్ చేసుకోండిలా

రైల్వే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్​ జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB). జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) వంటి పోస్టుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 2వేల570 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 30, 2025 వరకు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు ..

అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వ్‌డ్ కేటగిరీలకు ప్రభుత్వం నిర్ణయించిన వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

విద్యార్హతలు..

JE పోస్టులకు ..ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ లేదా సంబంధిత రంగంలో డిప్లొమా లేదా BE/BTech డిగ్రీ ఉండాలి.
CMA పోస్టులకు ..ఫిజిక్స్ ,కెమిస్ట్రీ నేపథ్యంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక విధానం ..

మూడు దశలలో RRB JE ఎంపిక ఉంటుంది. 
CBT -I (ప్రథమ కంప్యూటర్ పరీక్ష)
CBT- II (ద్వితీయ కంప్యూటర్ పరీక్ష)
డాక్యుమెంట్ వెరిఫికేషన్ & వైద్య పరీక్ష
CBT-Iలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే CBT-IIకి అర్హులు అవుతారు.

జీతం (Salary)..

ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 జీతం లభిస్తుంది. అదనంగా భత్యాలు కూడా చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం ..

అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in  లోకి వెళ్లి ఆన్​ లైన్​ దరఖాస్తు చేసుకోవాలి. 
హోమ్‌పేజీలో RRB JE Recruitment కింద ఉన్న Apply లింక్‌పై క్లిక్ చేయాలి. 
ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి.. లేదా కొత్త ఖాతా తెరవవచ్చు. 
మీ వ్యక్తిగత వివరాలు, అర్హతలు ఎంటర్​ చేసి అప్లికేషన్​ ను సబ్మిట్​ చేయాలి. తరువాత రిసిప్టును జాగ్రతగా పెట్టుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు ..

దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 31, 2025
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 30, 2025