రైల్వే కీలక నిర్ణయం.. కోవిడ్‌‌కు ముందు ఛార్జీలే

రైల్వే కీలక నిర్ణయం.. కోవిడ్‌‌కు ముందు ఛార్జీలే

భారతీయ రైల్వేశాఖ మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లను నడిపిన ఇండియన్ రైల్వే.. ఇక నుంచి వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.. ప్రస్తుతం పాత నంబర్, పాత చార్జీలతో మాత్రమే రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.. రైల్వేల ప్రకారం ఇప్పటి వరకు ప్రత్యేక రైళ్లకు కేటాయించిన నంబర్ ‘జీరో’ కూడా తొలగించనున్నట్లు తెలిపింది. కోవిడ్ కు ముందు ఉన్న రైల్వే చార్జీలే ప్రస్తుతం వర్తిస్తాయని ప్రకటించింది.

ప్రత్యేక రైళ్లలో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రజలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో నిర్ణయాన్ని పున:సమీక్షించుకుంది రైల్వే శాఖ. కోవిడ్ కు ముందు రైల్వేలో సుమారు 1700 మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేవి.. వీటిలో చాలా రైళ్లు పున:ప్రారంభమయ్యాయి. కోవిడ్ కు ముందు సుమారు 3500 ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. అయితే వీటిలో ప్రస్తుతం 1000 మాత్రమే నడుస్తున్నాయి. ప్రతిజోన్ లోని అన్ని సబర్బన్ రైళ్లను కూడా ప్రారంభించింది రైల్వేశాఖ.