24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం

ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట్ వర్షం పడింది. అంబర్ పేట్, నాంపల్లి, లక్డీకాపూల్ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్రానికి వాతావరణ శాఖ రెండు రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్లు వెల్లడించారు. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణపై ప్రభావం కొద్దిగా ఉంటుందన్నారు. రుతుపవనాలు తిరోగమనం చెందుతున్నాయని తెలిపారు. తూర్పు నుంచి ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. రాత్రి వేళ ఉష్ణోగ్రతల్లో మార్పు లేదని చెప్పారు. డిసెంబర్ రెండో వారం నుంచి కోల్డ్ వేవ్ కండీషన్ ఏర్పడుతుందన్నారు.