రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు

మాండస్ తుఫాన్ మహాబలిపురం దగ్గర తుఫాన్ తీరం దాటింది. సాయంత్రం తీవ్ర వాయుగుండం బలహీనపడి, పశ్చిమ వాయువ్య దిశగా ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. మాండస్ తుఫాన్ కారణంగా తెలంగాణలో ఇవాళ, రేపు అక్కడక్కడ తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.

తూర్పు నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఖైరతాబాద్, మెహిదీపట్నం, హిమాయత్ నగర్, నాంపల్లి, పంజాగుట్ట, బేగంపేట, చాదర్ ఘాట్ ఏరియాల్లో చిరుజల్లులు పడుతున్నాయి.