ఏపీకి మూడురోజుల పాటు భారీ వర్షాలు

ఏపీకి మూడురోజుల పాటు భారీ వర్షాలు

ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళా ఖాతము నుండి దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు , రేపు మరియు ఎల్లుండి ఉత్తర కోస్తా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . దక్షిణ కోస్తా ఆంధ్రలో ఇవాళ రేపు తేలికపాటినుండి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్లకురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. ఇక రాయలసీమలో ఇవాళ రేపు, ఎల్లుండి పలు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. మరోవైపు తెలంగాణలో మాత్రం రానున్న మూడురోజులు వాతావరణం పొడిగా ఉంటుందన్నారు అధికారులు.