పొగమంచుతో ఢిల్లీలో పలు రైళ్లు రద్దు

V6 Velugu Posted on Jan 20, 2022

ఒకవైపు కరోనా.. మరోవైపు పొగమంచుతో ఢిల్లీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి తోడు నగరంలో కొద్దిపాటి వర్షం కూడా కురిసింది. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగమంచు కారణంగా 13 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో 22 రైళ్లను రద్దుచేశారు అధికారులు. హౌరా–న్యూ ఢిల్లీ ఎక్స్ ప్రెస్, పూరీ–న్యూ ఢిల్లీ ఎక్స్ ప్రెస్, కాన్పూర్–న్యూ ఢిల్లీ ఎక్స్ ప్రెస్ తదితర రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో ఈనెల 21 నుంచి 23 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అందుకే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. చలిగాలులు వీయడంతో ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని  చెప్పారు.  

 

మరిన్ని వార్తల కోసం

ప్రధానిపై రాహుల్ గాంధీ సెటైర్

ఏపీ, బిహార్ రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం

 

Tagged UttarPradesh, punjab, IMD, Rain Lashes Parts of Delhi, Fog Effect Cancelled Trains, Widespread rainfall

Latest Videos

Subscribe Now

More News