ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కి వర్షం ముప్పు! రద్దయితే ఏంటి పరిస్థితి?

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కి వర్షం ముప్పు! రద్దయితే ఏంటి పరిస్థితి?

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానుల నిరీక్షణకు రేపటితో తెర పడనుంది. గతేడాది టీ 20వరల్డ్ కప్ తర్వాత ఇండియా- పాకిస్థాన్ తలబడుతున్న మొదటి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. దీంతో అభిమానులు పాకిస్థాన్ న చిత్తుగా ఓడించాలని తమ ఫేవరేట్ ప్లేయర్ బాగా రాణించాలని ఆశిస్తున్నారు. పైగా గత కొంతకాలంగా మమ్మల్ని ఓడించడం అంత తేలికైన విషయం కాదని.. ఆసియా కప్ తో పాటు వరల్డ్ కప్ లో భారత్ ని ఓడిస్తామని పాకిస్థాన్ మాజీలు, ప్లేయర్లతో అభిమానులు కూడా మాటలతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో హోరా హోరీ పోరు ఖాయమని భావించారంతా. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ మ్యాచ్ కి వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఫ్యాన్స్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. అయితే వర్షం పడితే ఏంటి పరిస్థితి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

వర్షం పడితే టీ 20 తరహాలో:

హైబ్రిడ్ మోడల్ విధానం అనుసరించి భారత్ పాకిస్థాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లకెల ఆతిధ్యమిస్తుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. తాజా సమాచార ప్రకారం ఈ మ్యాచ్ సమయంలో వర్షం పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ సమయంలో వర్షం అంతరాయం కలిగిస్తే టీ 20 ఫార్మాట్ లో ఈ మ్యాచ్ ని నిర్వహిస్తారు. ఒకవేళ మ్యాచ్ సాధ్యం కానీ పక్షంలో ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. ఇలా జరిగితే పాక్ ఎలాంటి సమీకరణాలు లేకుండా సూపర్ ఫోర్ దశకు చేరుకుంటుంది. మరో బెర్త్ కోసం టీమిండియాతో నేపాల్ అమీ తుమీ తేల్చుకోనుంది. మరి వరుణుడు కరుణిస్తాడో లేకపోతే అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లుతాడో చూడాలి.