నాలుగు రోజులు వానలు

నాలుగు రోజులు వానలు

రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం కాస్త చల్లబడింది.  భానుడి తాపం నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఇవాల్టి నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో ఎలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిన్న కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. మరో వైపు కొన్ని జిల్లాల్లో మాత్రం భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌతాలలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మంచిర్యాల భీమినిలో 42.9, ఆదిలాబాద్ లోని జైనథ్ లో 42.8 ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.