 
                                    సూర్యాపేట, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో విద్యుత్ శాఖకు రూ.30 లక్షల నష్టం వాటిల్లిందని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ కమర్షియల్ సీహెచ్ చక్రపాణి తెలిపారు. విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి డ్యామేజ్ అయిన వాటిని పునరుద్ధరించి కరెంటు సరఫరా అవాంతరాలు లేకుండా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల నష్టం వాటిల్లిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలకు సూర్యాపేట జిల్లాలో సుమారు 72 పోల్స్ ఎల్టిలో, హెటి 22 పోల్స్, ఐదు ట్రాన్స్ పార్మర్ డ్యామేజీ అయినట్లు వివరించారు. వీటన్నిటిని పునరిద్దరించినట్లు వెల్లడించారు.

 
         
                     
                     
                    