ఢిల్లీలో వర్షాలు.. కశ్మీర్ను కప్పేసిన మంచు

ఢిల్లీలో వర్షాలు.. కశ్మీర్ను కప్పేసిన మంచు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బల్లభ్ గఢ్, ఛప్రౌలా, నోయిడా, దాద్రి, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయితే చిన్నపాటి వర్షానికే పలు చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు పేరుకుపోవడంతో క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం వర్షం కురిసింది. ఇకపోతే, హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తయిన ప్రాంతాల్లో మంచు భారీగా కురుస్తోంది. జమ్మూ కశ్మీర్ లో కూడా మంచు భారీగా పడుతోంది. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో ప్రజలు గజగజలాడుతున్నారు. మంచు భారీగా కురుస్తుండటంతో ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వచ్చే పలు ఇండిగో, విస్తారా ఫ్లయిట్ రద్దయ్యాయి. 

మరిన్ని వార్తల కోసం: 

ఉజ్జయిని ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ ఆరిఫ్ ఖాన్

వారంలోపే 2 కోట్ల మందికి టీనేజర్లకు టీకా

రాఘవకు హైబీపీ ఉంది.. వైద్యులు