రాఘవకు హైబీపీ ఉంది.. వైద్యులు

రాఘవకు హైబీపీ ఉంది.. వైద్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వనమా రాఘవ విచారణ కొనసాగుతోంది. రాఘువకు ప్రభుత్వ డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. రాఘవకు హైబీపీ ఉందని వైద్యులు తెలిపారు. ఐతే విచారణలో రాఘవ పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు రాఘవ దురుసుగా సమాధానం ఇస్తున్నాడని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. రామకృష్ణ ఫ్యామిలీ బలి కేసులో రాఘవపై సెక్షన్ 302, 306, 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాఘువకు సహకరిస్తున్న మురళి, గిరీష్‎లను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. గిరీష్ కాంగ్రెస్‎లో యువనేతగా ఉన్నారు. గిరీష్ పలు సెటిల్మెంట్లకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది.